Wednesday, July 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మందకృష్ణ మాదిగ కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలి: ఎమ్మార్పీఎస్ నాయకులు

మందకృష్ణ మాదిగ కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలి: ఎమ్మార్పీఎస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
ప్రభుత్వం వికలాంగులకు రూ.6 వేలు,వితంతువులు, వృద్ధులకు రూ.4 వేలు ఆసరా పింఛన్లు పెంచాలని ఈ నెల 25న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేపట్టే కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని నాచారం గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కేసారపు నరేష్ మాదిగ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రుద్రారపు రామచంద్రం మాదిగ, దమ్ము చిన్న మాదిగ,ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగ హాజరై మాట్లాడారు. ఈనెల 25వ తారీఖున వికలాంగుల,వృత్తుల,వితంతువుల ప్రదాత మందకృష్ణ మాదిగ మినీ సింహగర్జన మీటింగ్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షులు యాషనబోయిన సాంబయ్య యాదవ్, వికలాంగుల జిల్లా ప్రధాన కార్యదర్శి పంచక కుమార్ యాదవ్,మాదిగ యువసేన మండల అధ్యక్షుడు బండ రఘు మాదిగ,ఎమ్మార్పీఎస్ నాచారం కమిటీ అధ్యక్షులు ఇస్నపు అనిల్ మాదిగ, పోసాని శ్రీనివాసరావు, తాటికొండ మొగిలి, బేతు ఐలయ్య, రాపాల వర్షిత్, ఇందారపు ప్రభాకర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -