Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంకేంద్రంపై మందకృష్ణ ఒత్తిడి చేయాలి: ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కార్యదర్శి ఎం అడివయ్య

కేంద్రంపై మందకృష్ణ ఒత్తిడి చేయాలి: ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కార్యదర్శి ఎం అడివయ్య

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం తన వాటాగా వికలాంగుల కిస్తున్న రూ. 300ను రూ. ఐదు వేలకు పెంచేం దుకు మందకృష్ణ మోడీ సర్కారుపై ఒత్తిడి చేయా లని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆర్‌ వెంకటేశ్‌ అధ్యక్షతన రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశాన్ని నిర్వహించారు. 2012 నుండి వికలాంగుల పింఛన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా రూ. 300 మాత్రమే ఇస్తుందని తెలిపారు. ఇందిరా గాంధీ జాతీయ వికలాంగుల పింఛన్‌ను వికలాంగులందరికి వర్తింప చేయడం లేదని విమర్శించారు.
దేశంలో ఉన్న 2.68 కోట్ల మంది వికలాంగుల్లో 3.8 శాతం మందికి మాత్రమే పింఛన్‌ ఇస్తున్నారనీ, మిగతా వారికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన మందకృష్ణ వికలాంగుల పింఛన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా పెంపు కోసం ఆ ప్రభుత్వంపై పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ ప్రభుత్వం వాటా పెంచకుండా వికలాంగులను మోసం చేస్తుంటే ఆయన ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వికలాంగులలో సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం నింపేందుకు 2014లో వికలాంగుల వాయిస్‌ మాస పత్రికను ప్రారంభిం చామని గుర్తు చేశారు. పత్రిక ప్రారంభించి 11 ఏండ్లు పూర్తవుతున్న సందర్బంగా ఈ నెల 24న 11వ వార్షికోత్సవం- సాంస్కృతిక సమ్మేళనం నిర్వ హించనున్నట్టు తెలిపారు. 2016 ఆర్‌పీడబ్ల్యూడీ చట్టంలోని సెక్షన్‌ 27 ప్రకారం వికలాంగుల ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం లో 43.02 లక్షల మంది వికలాంగులుంటే రంగా రెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో మాత్రమే పునరావాస కేంద్రం ఉందని తెలిపారు. రాష్ట్రంనుండి 8 మంది బీజేపీ ఎంపీలున్నా, పునరావాస కేంద్రాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. సహాయ పరికరాలు అందించడం, ఫీజియోతేరాపి, స్పీచ్‌ థెరపి అవసరం ఉన్న వారికి అందించాల్సిన బాధ్యత పునరావాస కేంద్రలపై ఉందని గుర్తు చేశారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటళ్లలో వికలాంగుల కోసం పునరావాస కేంద్రలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో రాష్ట్ర కోశాధికారి రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉపేందర్‌, కాశప్ప, మధుబాబు, సహాయ కార్యదర్శి నాగలక్ష్మి, నగర్‌ కర్నూల్‌ జిల్లా అధ్యక్షులు కుర్మయ్య, హైదరాబాద్‌ గౌరవ అధ్యక్షులు శశికళ, నాయకులు గౌతమ్‌, నీరజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img