నవతెలంగాణ – ఆర్మూర్: రైతు భరోసా పథకానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన పట్టాదారు రైతులు మాత్రమే అర్హులు.ధరణి (భూభారతి) పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్య భూమి ఉన్నవారు, పట్టాదారులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఏ హరికృష్ణ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాన అర్హతలుతెలంగాణ నివాసి, కనీస వయస్సు 18 ఏళ్లు. దరఖాస్తుదారు పేరుమీద వ్యవసాయ భూమి ఉండాలి, ధరణి పోర్టల్‌లో నమోదు. చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులు అర్హులు లేనివారు, భూమి లేని రైతులు, వ్యవసాయ యోగ్యం కాని భూమి (బీడు భూములు, రాళ్లు, కొండలు, రియల్ ఎస్టేట్, కాల్వలు, వాణిజ్య భూములు) ఉన్నవారు, తెలంగాణ రైతు భరోసా పథకంలో భూమి ఎకరాలకు రైతు భరోసా రాదని తెలిపారు.
సాగు చేసే ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయం అందిస్తారు. అర్హత వివరాలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినట్లుగా, ఎన్ని ఎకరాలు ఉన్నా అన్ని సాగు భూములకు రూ.6,000 చొప్పున (సీజన్‌కు) డబ్బు జమ చేస్తారని,గతంలో కొన్ని విడతల్లో 2, 3, 7 లేదా 10 ఎకరాల వరకు క్రమంగా జమ చేశారు, కానీ పూర్తి పంపిణీలో ఎటువంటి సీలింగ్ లేదని తెలిపారు. సాటిలైట్ సర్వే ఆధారంగా సాగు భూములకు మాత్రమే సాయం అందుతుందని తెలిపారు.
గత ఫిబ్రవరి 28 ,.2026 తేదీ వరకు కొత్తగా పట్టా పాస్‌బుక్ పొందిన డిజిటల్ సైన్ అయిన రైతులు, అలాగే ఇప్పటివరకు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకునే రైతులు పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ప్రతులను రైతు భరోసా దరఖాస్తు ఫారానికి జతపరచి తమ గ్రామ వ్యవసాయ విస్తరణాధికారికి సమర్పించాలని తెలిపారు. అలాగే బ్యాంక్ ఖాతా వివరాల్లో మార్పులు చేయాలనుకునే రైతులు వెంటనే తమ గ్రామ ఏఈఓను సంప్రదించి వివరాలు ఇవ్వాలని సూచించారు.ఇప్పటికే రైతు భరోసా లబ్ధి పొందుతున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం రైతులు తమ గ్రామ ఏఈఓ లేదా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని ఆయన కోరారు.



