నవతెలంగాణ – హలియా
అనుముల మండలం హాలియాలో నూతనంగా ప్రారంభించబోతున్న శ్రీ చైతన్య పాఠశాలకు అనుమతి లేనందున హలియా మండల విద్యాధికారి గుండా కృష్ణమూర్తి బుధవారం తనిఖీ చేసి అడ్మిషన్లు తీసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని సీజ్ చేయడం జరిగింది.అనంతరం మండల విద్యాధికారి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను అనుమతి ఉన్న పాఠశాలలకు పంపించాలని అనుమతి లేని పాఠశాలలకు పంపించి ఇబ్బందులు పడవద్దని హలియా శ్రీ చైతన్య పాఠశాలకు ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేవని కాబట్టి ఈ పాఠశాలలో అడ్మిషన్లు తీసుకోవద్దని ఆయన అన్నారు.అదేవిధంగా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి వారు గ్రామాలలో ప్రచారం గానీ అడ్మిషన్ తీసుకునే ప్రక్రియ గాని చేసినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. అన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాతనే తన కార్యకలాపాలు కొనసాగించాలని అక్కడ ఉన్నటువంటి పాఠశాల సిబ్బందికి ఆయన తెలియజేశారు.
అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాల అడ్మిషన్ కార్యాలయాన్ని సీజ్ చేసిన మండల విద్యాధికారి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES