– ప్రాధమిక స్థాయి లో రాణిస్తున్న విద్యార్థులు
– అభినందించిన ఎంఈఓ ప్రసాదరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రాధమిక, ప్రాథమికోన్నత పాఠశాలల మండల స్థాయి ప్రతిభా పోటీలను మంగళవారం మండలంలోని ఆసుపాక మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించారు. ప్రశ్నావళి, పలు ప్రతిభా పాటవాలు కు నిర్వహించిన ఈ పోటీల్లో క్విజ్ విభాగం లో పీఎం శ్రీ ఎంపీయూపీఎస్ నారంవారిగూడెం పాఠశాల 7 వ తరగతి విద్యార్థులు ఎం.శ్రీరాం, విజయ, పవన్ సాయి తేజ, 6 వ తరగతి విద్యార్థని వైష్ణవి లు ప్రధమ స్థానంలో నిలిచారు. ప్రతిభా పోటీలో 7 వ తరగతి విద్యార్థి బి.విజయ్ మూడో స్థానం లో ఉన్నారు.
ప్రతిభావంతులు అయయిన ఈ విద్యార్థులను ఎంఈఓ ప్రసాదరావు అభినందించారు.పీఎం శ్రీ ఎంపీయూపీఎస్ నారంవారిగూడెం పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు ఆశిక్ ఆలం ను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక హెచ్ ఎం కే.విజయ లక్ష్మి, అశ్వారావుపేట బాలురు,బాలికల, అచ్యుతాపురం, గుమ్మడి వల్లి , నారాయణపురం, మామిళ్ళవారిగూడె ప్లెక్సు హెచ్ ఎం లు హరిత, షాసినా బేగం, కొండల రావు, వీరేశ్వరరావు, ఎస్.వెంకటేశ్వరరావు లు పాల్గొన్నారు.



