- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కార్యాలయానికి డి. క్రాంతి కుమార్ సూపరిండెంట్ గా పదవి బాధ్యతలు మంగళవారం స్వీకరించారు. రామారెడ్డి గ్రామ పంచాయతీ గ్రేడ్ – 1 కార్యదర్శిగా విధులు నిర్వహించి పదోన్నతిపై జుక్కల్ మండల కార్యాలయానికి పర్యవేక్షకులుగా విచ్చేసినారు. ఈ సందర్భంగా జుక్కల్ మండలంలోని 30 గ్రామ పంచాయతీ కార్యదర్శుల తరపున సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ సార్, ఎంపిఓ రాము సార్, మండల కార్యాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



