నవతెలంగాణ-హైదరాబాద్: కుండపోత వర్షాలు హిమచల్ ప్రదేశ్‌ను జలదిగ్భందం చేసిన విషయం తెలిసిందే. భారీ వరదలు పొటెత్తి..వందల సంఖ్యలో జనాలు మరణించారు. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం చేకూరిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మండి అనే జిల్లా భారీ వర్షాలకు అధికంగా ప్రభావితమైంది. ఆయా ప్రాంతాల్లో భారీ వరదలకు నదులు ఉప్పొంగి..మండిలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.
అయితే మండి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరుపున ఎంపీగా ఎన్నికైన బాలీవుడు హీరోయిన్ కంగనా రనౌత్ ఆ వైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. వరదలతో అల్లాడిపోతున్న తన నియోజకవర్గ ప్రజలను పరామర్శించడానికి కూడా రావట్లేదని ప్రతిపక్షలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన కంగనా..తాపీగా సోషల్ మీడియా ఎక్స్ వేదిగా విచారం వ్యక్తం చేసింది.
ఇదిలావుండా బీజేపీ మాజీ సీఎం జైరాం ఠాకూర్ పరోక్షంగా ఆమెను ఉద్దేశిస్తూ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘నాకు తెలియదు. నేను దానిపై వ్యాఖ్యానించడానికి ఇష్టపడను. మనం శ్రద్ధ వహించే వారి కోసం ఏమైనా చేసేందుకు మేం ఇక్కడ ఉన్నాం. పట్టించుకోని వారి గురించి వ్యాఖ్యానించాలనుకోవడం లేదు’’ అని ఠాకూర్ అన్నారు.
‘‘ఎంపీ కంగనా రనౌత్.. మండి ప్రజల గురించి పట్టించుకోరు. ఇవి మా మాటలు కాదు.. హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి,బీజేపీ నాయకుడు జైరాం ఠాకూర్ స్పందన ఇది. ఈ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర విషాదాన్ని ఎదుర్కొంటున్నారు. కానీ వారి ఎంపీ ఎక్కడా కనిపించడం లేదు’’ అని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.