Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్తాడ్వాయి నూతన తాహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన మంజుల 

తాడ్వాయి నూతన తాహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన మంజుల 

- Advertisement -

నవతెలంగాణ -తాడ్వాయి  : ములుగు జిల్లా తాడ్వాయి మండలం నూతన తాసిల్దారుగా పి. మంజుల శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో వెంకటాపూర్(రామప్ప) మండలంలో తాసిల్దారుగా మూడు సంవత్సరాలు విధులు నిర్వహించి, వరంగల్ కలెక్టరేట్లో సూపర్డెంట్ గా విధులు నిర్వహించారు. అక్కడినుండి బదిలీపై తాడ్వాయి నూతన తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన తాసిల్దార్ పి మంజుల మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కులం ఆదాయ ధ్రువపత్రాల అర్హులైన ప్రతి ఒక్కరికి చేరువచేసి మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు. అనంతరం రెవిన్యూ సిబ్బందితో సమావేశమయ్యారు. అందరూ తమ విధులు పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -