- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో నక్సలైట్లు అమర్చిన మందుపాతర పేలుడులో ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. బీజాపూర్ డీఆర్‌జీ బృందానికి చెందిన జవాన్ దినేష్ నాగ్ ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు జవాన్లు గాయపడ్డారని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. గాయపడిన జవాన్ల పరిస్థితి ప్రమాదకరంగా లేదని, మెరుగైన చికిత్స కోసం తరలిస్తున్నట్లు చెప్పారు.
- Advertisement -