- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నిజామాబాద్‌లో శనివారం గంజాయి ముఠా కారుతో ఢీకొట్టడంతో ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్య గాయపడిన విషయ తెలిసిందే. సౌమ్యను ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం సౌమ్యను హైదరాబాద్‌కు తరలించారు. నిర్మల్ కు చెందిన గంజాయి ముఠా కారులో గంజాయి తీసుకెళ్తున్న క్రమంలో కారును అడ్డుకునేందుకు మహిళా కానిస్టేబుల్ సౌమ్య ప్రయత్నించగా ఆమెను కారుతో ఢీకొట్టింది.
- Advertisement -



