నవతెలంగాణ-హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మార్కాపురం ఘోర బస్సు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోగా మరో 27 మందికి గాయాలు అయ్యాయి. ఈ దుర్ఘటనలో మృతి చెందిన బాధితులకు కేంద్రం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సాయాన్ని పీఎంఓ అధికారులు వెల్లడించారు.
కాగా ఈ ఘోర ప్రమాదంపౌ ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. “మార్కాపురంలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరం. తమ ప్రియతములను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.



