Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుభారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, మన మార్కెట్లు రాణించడం గమనార్హం. ముఖ్యంగా ఐటీ, మెటల్, రియల్టీ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీల పెరుగుదలకు దోహదపడింది. ఈ ఉదయం సెన్సెక్స్ 81,034 పాయింట్ల వద్ద కొంత నష్టంతో ప్రారంభమైంది. అయితే, కొద్దిసేపటికే కోలుకుని రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,865 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సెన్సెక్స్, చివరికి 677 పాయింట్ల లాభంతో 81,796 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 227 పాయింట్లు లాభపడి 24,946 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.04గా ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad