నవతెలంగాణ-హైదరాబాద్ : భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం విషయంపై కీలక ప్రకటన చేశారు. తన పెండ్లి రద్దయినట్లు ఆమె ఇన్‌స్టా స్టోరీలో ప్రకటించారు.
మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌తో నవంబర్ 23న జరగాల్సిన పెళ్లి.. పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ‘గత కొన్ని వారాలుగా నా జీవితం చుట్టూ చాలా ఊహాగానాలు సాగాయి. ఇలాంటి సమయంలో నేను మాట్లాడటం చాలా ముఖ్యం. నా గురించి అన్నీ గోప్యంగా ఉండాలని భావించే వ్యక్తిని. కానీ, వివాహం రద్దయిందని అందరికీ స్పష్టం చేయాలనుకుంటున్నా. ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తారని భావిస్తున్నా. రెండు కుటుంబాల గోప్యతను గౌరవించి.. ముందుకు సాగేందుకు స్పేస్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా. దేశాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచేందుకు ముందుకు సాగుతా. భారత్ తరఫున మరిన్ని మ్యాచ్‌లు ఆడి ట్రోఫీలు గెలుస్తా. నాకు మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది’ అని స్మృతి స్టోరీలో రాసుకొచ్చారు.



