- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీం కింద పడేసిందని ఓ అత్త తన కోడలిని మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన కోడలు అనుప్రియ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అశ్విన్ రాజ్ అనే వ్యక్తి అనుప్రియను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఆమె మృతి తో ఇరుకుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -