- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పహాడీషరీప్ ప్రాంతంలో నివాసముంటున్న వసంత(29)కి ఇద్దరు కుమారులు. ఏడేళ్ల నందు, మూడున్నర ఏళ్ల చెర్రీ ఉన్నారు. నాలుగేళ్ల కిందట భర్త లక్ష్మణ్ కామెర్ల వ్యాధితో చనిపోయాడు. అప్పటి నుంచి పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. శుక్రవారం మధ్యాహ్నం పిల్లలతో కలిసి ట్యాంక్‌బండ్‌కు వచ్చిన ఆమె అక్కడ కుర్చీలో వారిని కూర్చోబెట్టింది. సెల్‌ఫోన్ ఇచ్చి ఆడుకోమని చెప్పి సాగర్‌లో దూకింది సూసైడ్ చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి మార్చురీకి తరలించారు. పిల్లలను ఆమె సోదరుడికి అప్పగించారు.
- Advertisement -



