Friday, January 9, 2026
E-PAPER
Homeబీజినెస్వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న మార్వాడీ విశ్వవిద్యాలయం

వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న మార్వాడీ విశ్వవిద్యాలయం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమం సాధించిన విజయపు స్ఫూర్తితో, మార్వాడీ విశ్వవిద్యాలయం ఇప్పుడు  ప్రతిష్టాత్మకమైన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సులకు (విజిఆర్సి) ఆతిథ్య వేదికగా నిలవనుంది. గుజరాత్ ప్రభుత్వం నిర్వహించనున్న ఈ సదస్సు 2026 జనవరి 11 నుండి 12 వరకు జరగనుంది.

సౌరాష్ట్రతో పాటు గుజరాత్ రాష్ట్రాన్ని మొత్తంగా విద్యా రంగంలో ప్రపంచ స్థాయిలో నిలపడమే లక్ష్యంగా, ఈ విశ్వవిద్యాలయం గుజరాత్ ప్రభుత్వ విద్యా విభాగానికి రూ. 1,000 కోట్ల పెట్టుబడికి సంబంధించిన అవగాహన ఒప్పంద ప్రతిపాదనను సమర్పించింది. ఈ ప్రతిపాదిత పెట్టుబడి అత్యాధునిక ప్రయోగశాలలతో కూడిన కొత్త విద్యా భవనాలు, ఆధునిక క్రీడా సౌకర్యాలు మరియు నూతన తరం హాస్టళ్లతో సహా అత్యాధునిక విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడుతుంది.

“స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత” ( వోకల్ ఫర్ లోకల్ ) నినాదానికి అనుగుణంగా, VGRC గుజరాత్‌లోని నాలుగు జోన్‌లలో – ఉత్తర, సౌరాష్ట్ర-కచ్, దక్షిణ మరియు మధ్య గుజరాత్‌లలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం మరియు నెదర్లాండ్స్ వంటి దేశాలతో పాటు JETRO, ICBC, USISPF, ప్రపంచ బ్యాంక్ మరియు రష్యన్ ఫెడరేషన్ వంటి సంస్థల నుండి కూడా భాగస్వామ్యం ఉండనుంది.

మార్వాడీ విశ్వవిద్యాలయం ట్రస్టీ ధ్రువ్ మార్వాడీ మాట్లాడుతూ, “కచ్-సౌరాష్ట్ర ప్రాంతం కోసం వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సులకు ఆతిథ్యం ఇవ్వడం మాకు చాలా సంతోషంగా వుంది. ఆవిష్కరణలు, పరిశ్రమల భాగస్వామ్యం , నైపుణ్యాభివృద్ధి కి అధిక ప్రాధాన్యత ఇచ్చే సంస్థగా, స్థానిక సంస్థలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ సంస్థలు మరియు ప్రపంచ పెట్టుబడిదారుల మధ్య సహకారాలను పెంపొందించే వేదికను అందించడం మాకు గర్వకారణంగా వుంది. గుజరాత్ అభివృద్ధికి తోడ్పడటంతో పాటుగా వికసిత భారత్ లక్ష్యానికి తోడ్పడాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అని తెలిపారు. 

మార్వాడి విశ్వవిద్యాలయం ప్రోవోస్ట్ ఆర్.బి. జడేజా మాట్లాడుతూ  “గుజరాత్ పురోగతికి మరియు వికసిత్ భారత్@2047 యొక్క విశాల దృక్పథానికి మేము తోడ్పడనుండటం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమమును నిర్వహించడం అనేది ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం, సమ్మిళిత వృద్ధి ఇంజిన్‌గా గుజరాత్ ఆవిర్భావానికి దోహదపడాలనే మా నిబద్ధతకు ప్రతీక ”అని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -