Friday, November 28, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅలాస్కాలో భారీ భూకంపం..6.0గా నమోదు

అలాస్కాలో భారీ భూకంపం..6.0గా నమోదు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికాలోని అలాస్కాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 8.11 గంటల సమయంలో బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం.. అలాస్కాలోని సుసిట్నాకు వాయువ్యంగా 7 మైళ్ల దూరంలో లేదా ఆంకరేజ్‌కు వాయువ్యంగా 35 మైళ్ల దూరంలో ఉందని ఏజెన్సీ డేటా చూపిస్తుంది. ఈ భూకంపం ఎఫెక్ట్ రాష్ట్రంలోని దక్షిణ-మధ్య భాగం అంతటా, ఉత్తరాన 245 మైళ్ల దూరంలో ఉన్న ఫెయిర్‌బ్యాంక్స్ వరకు సంభవించిందని అలాస్కా భూకంప కేంద్రం తెలిపింది. 69 కి.మీ లోతులో భూకంపం సంభవించగా.. దీని కేంద్రం అలాస్కాలోని సుసిట్నాకు పశ్చిమ-వాయువ్య దిశలో 12 కి.మీ దూరంలో ఉంది. 2018లో 7.1 తీవ్రతతో వచ్చిన భూకంపంలా అనిపించిందని కొందరు అలాస్కన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -