- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉత్తర ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మజార్-ఈ-షరీఫ్ సమీపంలో చోటు చేసుకున్న ఈ భూకంపం ధాటికి ఇళ్లు, భవనాలు కూలిపోయాయి. ఈ దుర్ఘటనలో కనీసం 10 మంది మృతి చెందగా, 260 మందికి పైగా గాయపడ్డారు. బాల్ఖ్, సమంగాన్ ప్రావిన్స్‌లలో భారీ నష్టం జరిగింది. టిప్పర్ లారీలు, వాహనాలు నాశనమయ్యాయి. భూకంపం కారణంగా దెబ్బతిన్న రహదారుల వల్ల సహాయక బృందాలు అక్కడికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
- Advertisement -



