నవతెలంగాణ-హైదరాబాద్ : దక్షిణ అమెరికా దేశాలైన చిలీ, అర్జెంటీనాల దక్షిణ తీర ప్రాంతాల్లో శుక్రవారం నాడు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. భూకంపం అనంతరం సునామీ హెచ్చరికలు జారీ కావడంతో చిలీ అధికారులు అప్రమత్తమై, తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:58 గంటలకు (12.58 GMT) ఈ భూకంపం వచ్చినట్లు USGS తెలిపింది. అర్జెంటీనాలోని ఉషువాయా నగరానికి దక్షిణంగా 219 కిలోమీటర్ల దూరంలో డ్రేక్ పాసేజ్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతున ఇది సంభవించినట్లు ఏజెన్సీ పేర్కొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ భూకంపం వల్ల తక్షణమే ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాలు సంభవించినట్లు నివేదికలు అందలేదని ఏపీ వార్తా సంస్థ తెలిపింది.
చిలీ, అర్జెంటీనా తీరాల్లో భారీ భూకంపం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES