నవతెలంగాణ-హైదరాబాద్ : కర్రె గుట్టలపై 20 రోజులుగా భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. దీనిలో భాగంగా ఐదు బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి 10 వేల మందికి పైగా జవాన్ లు అడవులను జల్లెడ పడుతున్నారు. బుధవారం ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ కర్రె గుట్టల పై భద్రతా బలగాలకు మావోల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు కొనసాగుతుందటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎన్ కౌంటర్ ని ఐజీ సుందర్ రాజ్, సీఆర్పీఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్ ధ్రువీకరించారు.
బ్లాక్ కర్రె గుట్టలపై భారీ ఎన్ కౌంటర్..22 మంది మవోయిస్టులు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES