- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నిర్మల్ పట్టణంలోని నారాయణరెడ్డి మార్కెట్ వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాలుగు మొబైల్ షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.20 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
- Advertisement -



