Sunday, January 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఘోర అగ్నిప్రమాదం.. 16 మంది సజీవ దహనం

ఘోర అగ్నిప్రమాదం.. 16 మంది సజీవ దహనం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇండోనేసియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది సజీవ దహనం అయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక బృందాలు దాదాపు గంటలపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి దాదాపు 20 కంటే ఎక్కువ మందిని రక్షించి వివిధ హాస్పిటల్‌లకు తరలించారు. ఆదివారం రాత్రి ఉత్తర సులవేసి ప్రావిన్స్ రాజధాని మనడో నగరంలోని ఓ నర్సింగ్ హోమ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. రానోముట్ సబ్‌ డిస్ట్రిక్ట్‌, పాల్‌ డువా ప్రాంతంలో సాయంత్రం మంటలు చెలరేగాయి. ఈ విషాద ఘటనపై ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -