Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయం67 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం..

67 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -

– దుబాయ్‌లో వేలాదిమంది సురక్షిత ప్రాంతానికి తరలింపు
అబుదాబి:
దుబాయ్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ క్రమంలోనే వేలాదిమంది నివాసితులను సురక్షితంగా తరలించిన అధికారులు.. గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దుబాయ్‌ మీడి యా కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. ‘టైగర్‌ టవర్‌ ‘గా పేరు పొందిన ఇక్కడి 67 అంతస్తుల ‘మెరీనా పినాకిల్‌’ భవనంలో శుక్రవారం అర్ధరాత్రి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈమేరకు సమాచారం అందుకున్న సహాయక బ ృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. దాదాపు 6 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ క్రమంలోనే భవనంలోని 764 ఫ్లాట్‌లలోని 3,820 మంది నివాసితులను సురక్షితంగా తరలించారు. అంబులెన్సులు, వైద్యసిబ్బందిని మోహరించారు. ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నివాసితులకు తాత్కాలిక వసతి ఏర్పాట్ల కోసం చర్యలు తీసుకుంటున్నట్టు డీఎంవో తెలి పింది. ఇదిలా ఉండగా.. మెరీనా పినాకిల్‌లో మంటలు చెలరేగడం ఇదే మొదటిసారి కాదు. 2015లోనూ 47వ అంతస్తులో మంటలు చెలరేగి.. 48వ అంతస్తుకూ వ్యాపించాయి. చివరకు సహాయక సిబ్బంది మంటలార్పేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad