నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ సమీపంలో గల మటియాలా చేపల మార్కెట్‌లో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మార్కెట్‌లోని పలు దుకాణాలు, సమీపంలోని గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారుల కథనం ప్రకారం.. అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో ఫిష్ మార్కెట్‌లో మంటలు చెలరేగినట్లుగా సమాచారం అందింది. వెంటనే స్పందించిన అధికారులు 23 ఫైరింజన్లను ఘటనా స్థలానికి తీసుకెళ్లి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. అయితే, ఆస్తి నష్టం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..వందలాది పూరిళ్లు దగ్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



