నవతెలంగాణ-హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నిజాంసాగర్ జలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం ఉదయం ఎగువ ప్రాంతాల నుంచి 2,31,363 క్యూసెక్కుల వరద వచ్చి చేరడంతో 24 గేట్లను ఎత్తి 1,99,244 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేసినట్లు కామారెడ్డి సీఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1,404 అడుగులు (16.472 టీఎంసీలు) ఉందని పేర్కొన్నారు. నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని.. మంజీరా నదిలోకి దిగవద్దని సూచించారు. నిజాంసాగర్ జలాశయం దిగువన మంజీరా నది పరివాహక మండలాలైన నిజాంసాగర్, మహమ్మద్ నగర్, బాన్సువాడ మండలంలోని ఆయా గ్రామాల్లో వందల ఎకరాల్లో వరిపంటలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం ఏర్పడింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజాంసాగర్ జలాశయంలోకి భారీగా వరద
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES