Thursday, April 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఎవరెస్ట్ ట్రెక్కింగ్ పర్యాటకులే లక్ష్యంగా భారీ స్కాం

ఎవరెస్ట్ ట్రెక్కింగ్ పర్యాటకులే లక్ష్యంగా భారీ స్కాం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌ ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయి బీమా మోసం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ. 167 కోట్ల మేరకు ఈ మోసం జరిగినట్లు ‘ది ఖాట్మండు పోస్ట్’ వెల్లడించింది. ఈ కేసులో ట్రెక్కింగ్ కంపెనీల యజమానులు, హెలికాప్టర్ ఆపరేటర్లు సహా 32 మందిపై నేపాల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వివరాల ప్రకారం, గైడ్‌లు పర్యాటకుల ఆహారంలో బేకింగ్ సోడా కలిపి వారిని అనారోగ్యానికి గురిచేస్తున్నారు. దీంతో పర్యాటకులు తీవ్రమైన కడుపునొప్పి, జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఖరీదైన హెలికాప్టర్ అత్యవసర సేవలను వినియోగించుకునేలా చేస్తున్నారు. ఈ పరిస్థితిని ‘ఆల్టిట్యూడ్ సిక్‌నెస్’గా చూపించి అంతర్జాతీయ బీమా సంస్థల నుంచి భారీ మొత్తాలు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పర్యాటకులను బలవంతంగా హెలికాప్టర్ అంబులెన్స్‌లలో ఎక్కించి, నకిలీ వైద్య, విమాన పత్రాలతో మోసం నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. జనవరి 1న ప్రారంభమైన దర్యాప్తులో మూడు ప్రముఖ పర్వత రక్షణ సంస్థలకు చెందిన ఆరుగురు ఉన్నతాధికారులను అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -