నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలోని వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (WARN) ఫైలింగ్స్ ప్రకారం..ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) గత నెలలో భారీగా లేఆఫ్స్ ) ప్రకటించింది. దాదాపు 14,000 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ లేఆఫ్స్ ప్రభావం సంస్థలోని దాదాపు అన్ని విభాగాలపై పడింది. క్లౌడ్ సర్వీసెస్, డివైజెస్, రిటెయిల్, అడ్వర్టైజింగ్, గ్రాసరీస్ విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితమయ్యారు. అయితే, ఈ లేఆఫ్స్‌కు సంబంధించిన కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ కోతల్లో అత్యధికంగా నష్టపోయింది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లేనని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది జనవరిలో మరో రౌండ్ లేఆఫ్స్ ఉండే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో లేఆఫ్స్ గుబులు మొదలైంది. ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
గతనెల అమెజాన్‌లో భారీగా లేఆఫ్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



