Tuesday, February 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయూఎస్ చ‌ర్య‌ను వ్య‌తిరేకిస్తూ వెనిజులాలో భారీ నిర‌స‌న ర్యాలీ

యూఎస్ చ‌ర్య‌ను వ్య‌తిరేకిస్తూ వెనిజులాలో భారీ నిర‌స‌న ర్యాలీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అధ్యక్షుడు మదురో, ప్రథమ మహిళ సిరిలా ఫ్లోర్స్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ వెనిజులా ప్రజలు దేశవ్యాప్తంగా వినూత్న నిరసన చేపట్టారు. దేశ రాజధాని కారకాస్‌ సహా పలు నగరాల్లో సోమవారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు జాగరణ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని డిమాండ్‌ చేయడంతో పాటు బలీవియన్‌ విప్లవానికి తమ ధృడమైన మద్దతును పునరుద్ఘాటించారు.

వెనిజులాపై సాయుధ దురాక్రమణకు దిగి, అధ్యక్ష దంపతులను అమెరికా కిడ్నాప్‌ చేసి నెలరోజులు పూర్తవడంతో నిరసన చేపట్టినట్లు యునైటెడ్‌ సోషలిస్ట్‌ పార్టీ ఆఫ్‌ వెనిజులా (పిఎస్‌యువి, స్పానిష్‌లో) ప్రధాన కార్యదర్శి డియోస్డాడో కాబెల్లో తెలిపారు. రాజధాని కారకాస్‌లో, అల్టాగ్రాసియా పారిష్‌లోని ఉర్దనేటా అవెన్యూలో లైవ్‌ మ్యూజిక్‌ను నిర్వహించారు. సార్వభౌమాధికారం మరియు స్వాతంత్య్రానికి మద్దతునిస్తున్నామని, అంతర్గత వ్యవహారాల్లో అమెరికా సామ్రాజ్యవాద జోక్యాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -