Sunday, August 3, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్‌కు వ్య‌తిరేకంగా సిడ్నీలో భారీ ర్యాలీ

ఇజ్రాయెల్‌కు వ్య‌తిరేకంగా సిడ్నీలో భారీ ర్యాలీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ పాలస్తీనావాసులకు మద్దతుగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే సహా అనేక మంది ప్రముఖులు, ప్రజలు గాజావాసులకు మద్దతు పలికారు. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ పైకి భారీగా చేరుకున్న నిరసనకారులు… గాజా వాసులకు మద్దతుగా బ్యానర్లు ప్రదర్శించారు.

గాజాపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. మానవతా సాయం అందేలా చూడాలని కోరారు. భారీ సంఖ్యలో వచ్చిన ప్రదర్శనకారులు తమ మార్గాన్ని మార్చుకోవడంతో.. సిడ్నీ హార్బర్ బ్రిడ్జిపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 60,400 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సిడ్నీలో ర్యాలీ నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -