- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలోని కార్ఖానా పీఎస్ పరిధిలో భారీ చోరీ జరిగింది. గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌లో కెప్టెన్ గిరి (75) అనే వ్యక్తి ఇంట్లో నేపాల్ ముఠా ఈ చోరీకి పాల్పడింది. గిరి ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన వ్యక్తి మరో నలుగురితో కలిసి ఈ దోపిడీ చేశాడు. వారు ఇంటి యజమానిపై కర్రలతో దాడి చేసి అతడిని కట్టేశారు. అనంతరం సుమారు రూ.50లక్షల విలువైన బంగారు నగలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. 25 తులాలకు పైగా బంగారం, రూ.23 లక్షల నగదును దొంగలు చోరీ చేసినట్లు బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



