- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 106 మంది ఇంజినీర్లను బదిలీ చేస్తూ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్‌వోసీల జారీ విషయంలో ఇంజినీర్లపై వచ్చిన ఆరోపణల ఆధారంగా ప్రభుత్వం చర్యలకు తీసుకుంది. బదిలీ అయిన ఇంజినీర్లలో ఈఈలు, డీఈఈలు, ఏఈఈఈలు ఉన్నారు. గతంలో వచ్చిన ఆరోపణలతోపాటు, క్షేత్ర స్థాయిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు రావడంతో సమూల ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం క్షేతస్థాయి ఇంజినీర్లను బదిలీ చేసింది. హైదరాబాద్ సర్కిల్ పరిధిలోనే 60 మందికిపైగా ఇంజినీర్లపై బదిలీ వేటు పడటం గమనార్హం.
- Advertisement -