నవతెలంగాణ-హైదరాబాద్: అంతర్జాతీయంగా పరంగా భారతీయ విద్యార్థులకు విషత్కర పరిస్థితులు ఎదురువుతున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లక్ష్యంగా అనేక ప్రతికూల నిర్ణయాలు తీసుకున్నారు. భారతీయులను కట్టడి చేసే ఉద్దేశ్యంతో హెచ్1బీ వీసా అనేక ఆంక్షలు విధించారు. ఒక్కసారిగా హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచారు. అదే విధంగా యూఎస్ యూనివర్సీటీలో విదేశాలకు చెందిన విద్యార్థల అనుమతిపై అనే షరతులు విధించారు. అక్రమ వలసల నివారణ పేరుతో అనేక మందిని భారత్‌కు పంపించారు. తాజాగా కెనడాలో భారతీయ విద్యార్థి వీసాలు భారీగా తిరస్కరణకు గురయ్యాయి.
కెనడా ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ (Canadas immigration department) గణాంకాల ప్రకారం.. 2025 ఆగస్టులో భారతీయ విద్యార్థులు చేసుకున్న దరఖాస్తుల్లో 74 శాతం తిరస్కరణకు గురయ్యాయి. 2023లో ఆ మొత్తం 32 శాతంగా ఉంది. ఇదే సమయంలో చైనా విద్యార్థి వీసాల తిరస్కరణ రేటు 24 శాతంగా ఉండగా.. మిగతా దేశాల సగటు రేటు 40 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.
విదేశీ విద్యకు అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న కెనడా.. గతేడాది దాదాపు 10లక్షల మంది విదేశీ విద్యార్థులకు అవకాశం కల్పించింది. వీరిలో 41శాతం భారత్ నుంచే ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో చైనా, వియత్నాం దేశాలు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇక భారీ స్థాయిలో విద్యార్థి వీసాల దరఖాస్తులను కెనడా తిరస్కరించడానికి అక్కడి స్థానిక పరిస్థితులే కారణమని ఇమిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నివాస కొరత, మౌలిక సదుపాయాల కల్పన ఇబ్బందిగా మారడం, స్థానిక ఖర్చులు విద్యార్థులు భరించగలరా? అన్న విషయాలపై ఆందోళనల నేపథ్యంలోనే కెనడా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. మరోవైపు అమెరికా, కెనడాలకు ప్రత్యామ్నాయం చూస్తున్న భారతీయ విద్యార్థులు జర్మనీ వైపు మొగ్గు చూపుతున్నట్లు మరో నివేదిక వెల్లడించింది.

                                    

