నవతెలంగాణ – హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియం దగ్గర క్యూలైన్ లో ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. పర్సులు, బ్లూటూత్, స్మార్ట్ వాచ్ లు, సన్ గ్లాసెస్ లతో ప్రేక్షకులను నిర్వాహకులు అనుమతించలేదు. పర్సులను అనుమతిస్తామని టికెట్ వాలెట్ అలో అని రాసి ఉన్నప్పటికీ పర్సులను అనుమతించకపోవడంపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. నిర్వాహకుల తీరుపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం డిపాజిట్ సెంటర్ కూడా లేదు.. వాలెట్ ఎక్కడ పెట్టాలని ప్రశ్నించారు. గతంలో లేని రూల్స్ ఇప్పుడెందుకని ఫ్యాన్స్ ప్రశ్నించారు. టికెట్ పై వాలెట్ అనుమతి ఉంది కాబట్టే తాము వాటిని స్టేడియానికి తెచ్చాం.. ముందే చెబితే ఇంట్లో పెట్టి వచ్చేవాళ్లమని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. నిర్వాహకుల ఆకస్మిక నిర్ణయంతో ఇబ్బంది పడ్డ ఫ్యాన్స్.. చేసేదేం లేక సన్ గ్లాసెస్ బయటే పడేసి లోపలికి వెళ్తున్నారు.
మరికాసేపట్లో మ్యాచ్..ఉప్పల్ స్టేడియం వద్ద ప్రేక్షకులు ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



