Thursday, July 10, 2025
E-PAPER
Homeజిల్లాలుCPI(M): మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించాలి..

CPI(M): మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించాలి..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్  : మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి వినియోగంలోకి తేవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు సీపీఐ(ఎం) తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ. రమేష్ బాబు, నగర కార్యదర్శి సుజాత జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రికి అనుసంధానంగా నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రం రూ.40 కోట్ల 50 లక్షలతో 2022 లోనే భవన నిర్మాణం పూర్తయినప్పటికీ, గత మూడు సంవత్సరాలుగా నిరుపయోగంలో ఉంటుందని అన్నారు. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందని తెలిపారు.

పాత భవనంలోనే జిల్లా కేంద్ర ఆస్పత్రిలో గర్భిణీ మహిళలకు ప్రసవాలు నిర్వహించటంతో అక్కడ సరైన సౌకర్యాలు లేక, సరిపడా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అనేకమంది పేద, మధ్యతరగతి ప్రజలు ప్రయివేట్ హాస్పిటల్ లో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి వాళ్ళు ప్రసవం చేయించుకునే పరిస్థితి వస్తుందని ఆయన తెలిపారు. అదేవిధంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ అనారోగ్యాలతో చేరిన వారికి సకాలంలో వైద్యం అందించి, ఆపరేషన్లు చేయటంలో సరిపడా థియేటర్లు లేవని అన్నారు. ఈ కారణంతో నెలల తరబడి రోగులకు వేచి ఉంచే పరిస్థితులు ఉన్నాయని, ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని ఆవేదన చెందారు.

అదే మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభిస్తే.. అందులోనే మహిళల ప్రసవాలను నిర్వహించటానికి సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. పాత భవనంలో ఇతర అనారోగ్యాలతో చేరిన వారికి సకాలంలో వైద్యం అందించటానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నూతనంగా భవనాన్ని నిర్మించి, వినియోగంలోకి తేలేకపోయినా.. మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని వాడకంలోకి తేవాలని జిల్లా కేంద్ర ఆస్పత్రికి సరిపడా వైద్య సిబ్బందిని నియమించి పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ పరిశీలించి తప్పకుండా మత శిశు ఆరోగ్యం కేంద్రాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -