- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ : రామనుజన్ జన్మదిన సందర్బంగా శాంభవి హై స్కూల్ లో సోమవారం జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం లో భాగంగా విద్యార్థులు మాథ్స్ కు సంభందించిన ఎక్స్పీరిమెంట్స్ తయారు చేసి ప్రదర్శన చేశారు. పాఠశాలలో ఉన్న మాథ్స్ ల్యాబ్ పరికరాలు,వాటి ఉపయోగాలు ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. మ్యాథ్స్ డే పురస్కరించుకొని విద్యార్థులు తయారుచేసిన మ్యాథ్స్ ప్రయోగాలను పాఠశాల ఉపాధ్యాయులు వీక్షించారు. ఈ సందర్భంగా మాథ్స్ ప్రయోగాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రశంసించారు. కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు , కరెస్పాండంట్ బొట్ల రవీన్ ప్రసాద్ , ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు
- Advertisement -



