నవతెలంగాణ-మల్హర్ రావు : మేడేని ఏదో సాంప్రదాయకంగా వచ్చే జండాల పండుగ లాగానో, సెలవు దొరికితే ఖుషి చేసే రోజు లాగా కాకుండా… స్వేచ్ఛ స్వాతంత్ర్యం కార్మికుల హక్కుల పరిరక్షణ, దోపిడీ నుంచి విముక్తి కోసం, పోరాటాలను ముందుకుతీసుకుపోయి మరిన్నిహక్కులు సాధించుకునే దినంగా సీఐటీయూ జరుపుకుంటోంది. కార్మిక హక్కుల కోసం, 8గంటల పనిదినం కోసం, కార్మికులు రక్తం చిందించిన ఆనాటి నుండి నేటి వరకు పోరాడిన, ప్రస్తుతం పోరాడుతున్న త్యాగధనుల స్పూర్తిని స్మరించుకుంటూ వారి బాటలో పయనిస్తామని పిడికిలి బిగించి ప్రతిజ్ఞ చేయాల్సిన దినం మేడే. 1886 మే4న చికాగో నగరంలో హేమార్కెట్టు సెంటర్లో చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఘటన జరిగింది. 8గంటల పని దినాన్ని అమలు చేయాలని హేమార్కెట్లు సెంటరులో వేలాది మంది కార్మికులు సభ ఏర్పాటు చేసుకున్నారు. ఆ నగరమేయర్ సభకు అనుమతి కూడా ఇచ్చారు. ఐతే పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించి యాజమాన్యాలతో కుమ్మక్కయి సభ ముగిసే సమయంలో కిరాయి గూండాలను ఉసిగొల్పి బాంబులు దాడికి ఒడిగట్టారు. ఈ ఘటనలో కార్మికులతో పాటు ఒక పోలీస్ అధికారి మృతిచెందారు. నగరంలో ఇతరులు కూడా గాయాల పాలయ్యారు. ఈ దాడి ద్వారా ఉద్యమాన్ని కర్కశంగా అణచి వేసి భయానక వాతావరణం స్రుష్టించి కార్మిక సంఘాల వారి నాయకులను బాధ్యులనుజేస్తూ వందలాది మంది కార్మికులను, కార్మిక నాయకులను జైళ్ళలో కుక్కి చిత్రహింసలు పెట్టారు. కార్మికుల ఇళ్ళు ధ్వంసం చేశారు. లంచాలు ఇచ్చి సాక్షులను తెచ్చారు. కార్మికులకు వ్యతిరేకంగా విషప్రచారం చేశారు. దైవవ్యతిరేకులుగాను నాస్తికులు గాను, ప్రభుత్వ వ్యతిరేకులుగా నాడు పేపర్లలో కార్టూన్లు కూడా వేయించారు. బాంబు దాడితో సంబంధం ఉన్నదనే నెపంతో కార్మిక నాయకులకు ఉరి శిక్షలు వేశారు. ఉరిశిక్ష నుండి బయటపడాలంటే చేసిన తప్పులు ఒప్పుకొని క్షమా భిక్ష కోరుకుంటే శిక్ష తగ్గుతుందని జడ్జి చెప్పారు. ఇందుకు అంగీకారం తెలిపిన వారికి15సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు. ఒకనాయకుడిని కారాగారం లోనే మందుగుండు సామగ్రితో పేల్చేచారు. మిగిలిన కార్మిక నాయకులను ఉరి తీశారు. అమెరికా లోని అన్ని ట్రేడ్ యూనియన్లు ఉరిశిక్షలు ఆపమని, తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపాయి. బారీ ప్రదర్శనలు జరిగాయి. అనేకమంది ప్రముఖులు ఈ శిక్షలను నిరసించారు. ఇంగ్లాండ్, ఫ్రెంచ్, హాలెండ్, రష్యా ఇటాలియన్, చైనా, స్పెయిన్, చికాగో కార్మికులకు మద్దతుగా నిలిచారు.విరాళాలుకూడా సేకరించి పంపారు. చికాగోలో కార్మికులు, జైలు గోడలను బద్దలు కొట్టడానికి పూనుకున్నారు. మరణశిక్షను దుర్కొంటున్న కార్మికులు ఆలోచనలను తిరస్కరించారు. 11 వంబరు1887న ఆ వీరులు ఉరితీయబడ్డారు. వేలాది మంది కార్మికులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. 14 జూలై 1889న మేడేని అంతర్ జాతీయలేబర్ డేగా గుర్తించాలని అంతర్ జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య, తీర్మానించింది. 8గంటల పనిదినం, ప్రజా స్వామ్యం, కార్మిక హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఆరోజును మత వీరులదినంగా పాటించాలని తీర్మానించింది. దానికనుగుణంగానే ప్రంపంచవ్యాప్తంగా మేడే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మన దేశంలో, మనప్రాంతాలలో మేడేని జరుపుకుంటున్నారు. భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం, కార్మిక చట్టాల పరిరక్షణ కోసం, ప్రభుత్వ సంస్థల పరిరక్షణ కోసం, ఎనిమిది గంటల పని రక్షణ కోసం, కనీస వేతనం కోసం, రెగ్యులరైజేషన్, ఉద్యోగ భద్రత కోసం, మరిన్ని ఉద్యమాలు, పోరాటాలు జేస్తామని కార్మిక వర్గం ముందు పీఠాన నిలబడుతుందని ప్రతిజ్ఞ చేద్దాం.
మే డే చారిత్రక ప్రాధాన్యత… నేపథ్యం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES