నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్రంలోని వర్ని చౌరస్తాలోని ఎలక్ట్రిసిటీ కార్యాలయం వద్ద 139వ మే డే జెండా ఆవిష్కరణ దుబాయ్ నలవాల నర్సయ్య ఆవిష్కరణ జరిగింది. అనంతరం నర్సయ్య మాట్లాడుతూ.. జెనీవా నగరంలో కార్మికులు 16 గంటలు పనిచేసేవారు. యజమానులు కార్మికుల యొక్క రక్తాన్ని తాగేటువంటివారు. ఎనిమిది గంటల పని దినాన్ని కొరకు నిరంతరం పోరాటం చేసి 139 సంవత్సరాల కింద ఇదే రోజు పని గంటల దినాన్ని తగ్గించుకొని సంతృప్తి చెందారు. యజమానులు, భూస్వాములు కార్మికుల రక్తాన్ని తాగి లాభాలు అర్ధించేటువంటి స్థితి నుండి అనేక పోరాటాలు పోలీసుల ఆధ్వర్యంలో లాఠీ చార్జీలో ఆ త్యాగదనులు పోతూ పోతూ నీకు జ్ఞాపకాలు ఏవి అని అడగగా.. రక్తం నుండి వెలువడిన ఎరుకుదననే కార్మికుల చిన్నంగా భావించాలని, కార్మికుల సమస్యల కోసం ఇదొకటి చిహ్నమని గుర్తు చెప్పి ప్రాణాలు వదిలారు. త్యాగధనుల ఫలితమే నేటి మేడే ఉత్సవాలు. కాబట్టి ఈ ఉత్సవాన్ని అందరూ జరుపుకోవాలని, కార్మికులను గుర్తించాలని ప్రభుత్వాలు నాలుగు లేబర్లు కోడ్లను తీసేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికుల హక్కులను కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారుసంపల్లి సతీష్ సిఐటియు నాయకులుసాయిలు నరేష్, హంజాద్, మహిబూబ్ రమేష్ హిస్మాయిల్, సాయిలు, రాజు ఎలాట్రిక్ కార్మికులు, రమేష, కార్మికులు పాల్గొన్నారు.
వర్ని చౌరస్తాలో మేడే వేడుకలు
- Advertisement -
RELATED ARTICLES