Friday, May 2, 2025
HomeUncategorizedఅర్సపల్లి అభివృద్ధి ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేడే వేడుకలు 

అర్సపల్లి అభివృద్ధి ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేడే వేడుకలు 

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
అర్సపల్లి అభివృద్ధి ఐక్యవేదిక ఆధ్వర్యంలో 139వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవము అర్సపల్లిలో గురువారం ఘనంగా నిర్వహించారు. తూటకూర నరసయ్య ఈ సభకు అధ్యక్షత వహించారు. ఈ సభలో ప్రపంచ మేడే గురించి, ఈ మేడే ఏర్పడ్డ విధానం గురించి సభికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముచుకూరు లావణ్య నవీన్ లు ప్రసంగించారు. ప్రీతం కాంగ్రెస్ యువ నాయకుడు మాట్లాడారు. చేగంటి గంగాధర్  ప్రసంగించారు. బట్టి గంగాధర్ సిర్ప నాగయ్య గారలు మే డే ప్రాధాన్యత ఐక్యత విధానాన్ని తమ సభలో ప్రసంగం ద్వారా ప్రజలకు తమ సందేశాన్ని వినిపించారు. బోరీ గం సాయిలు  లక్ష్మణ్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కే గోపాల్ కార్మికుల వర్గ చైతన్యం గురించి, పోరాటాల గురించి వివరించారు. దేవునూరి రాజయ్య రైతు నాయకులు సీపీఐ(ఎం) నాయకులు తమ సందేశాన్ని వివరించారు. డాక్టర్ రాజన్న, ఆసద్ అబ్బయ్య ఆటో వర్కర్స్ కోరువ కుమార్ సమస్యని వివరించారు.  ఈ సభలో ఆసది అబ్బయ్యపలువు గ్రామస్తులు మేస్త్రి సంఘం నాయకులు ఆటో యూనియన్ వర్కర్లు వ్యవసాయ కూలీలు మహిళ విద్యుత్ కార్మికులు మున్సిపల్ కార్మికులు బీడీ కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు ఆర్ఎంపీ డాక్టర్లు, లైబ్రరీ నాయకులు జాల నడిపి గంగాధర్, పెద్ద హనుమాన్లు, రమేష్, జేరిపోతుల రమేష్, చీమల రాజు, పురుషోత్తం, ధర్మరాజు, ఆరెట్టి అనిల్ ,శిర్ప లింగమ్మ ,సి ర్ప లింగం ప్రజా కళాకారుడు ఈ సభలో మేడే నిర్దేశించి ప్రపంచ కార్మిక దినోత్సవం గురించి తమ గా నాన్ని వినిపించారు. వందన సమర్పణతో సిర్ప లింగం గారు ముగించారు ఈ సభ హాజరైన వారికి అభినందనలు తెలిపారు. మే డే శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img