Saturday, May 3, 2025
Homeఖమ్మంమేడే కార్మికుల ఐక్యతకు సంకేతం..

మేడే కార్మికుల ఐక్యతకు సంకేతం..

నవతెలంగాణ – అశ్వారావుపేట
మే(డే) ఒకటో తేది అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యతకు సంకేతమని, కార్మిక వర్గ విజయానికి చిహ్నమని కార్మిక వర్గ ప్రతిఘటన వల్లనే 8 గంటల పని దినం చట్టం చేయబడిందని సీఐటీయూ  జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. గురువారం 139 వ మేడే దినోత్సవం సీఐటీయూ ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయం, హమాలి అడ్డ, భవన నిర్మాణ కార్మికుల కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించి సంఘ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ ..అధిక పని గంటలకు వ్యతిరేకంగా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అనేకమంది కార్మిక యోధులు త్యాగాలు చేశారని అన్నారు. కానీ నేడు బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత కార్మిక వర్గాన్ని అణచివేసి మేడే నాటి పూర్వపు దుర్మార్గపు రోజుల్లోకి తీసుకొని పోయేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది అని అన్నారు. కార్మిక వర్గం అనేక ఏళ్లుగా  పోరాటాలు త్యాగాలతో కార్మిక వర్గం సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోల్డ్ గా తీసుకురావటం దుర్మార్గమని అన్నారు. లేబర్ కోడలు ద్వారా పెట్టుబడిదారులు తృప్తి పరచడం కోసమేనని కార్మికులిని కట్టు బానిసలుగా మార్చడం అని అన్నారు. పాలకులు అనుసరిస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం మరింత పట్టుదలతో పోరాడుతూ మేడే అమరుల స్ఫూర్తితో ఐక్య పోరాటాలను ఉదృతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కేసుపాక నరసింహారావు,సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సోడెం ప్రసాదు,మున్సిపాలిటీకి కార్మికులు మూల అప్పన్న, కామేశ్వరరావు,వెంకన్న బాబు, చెన్నారావు,లక్ష్మణరావు,ఏసు నాగేంద్ర,మడిపల్లి వెంకటేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img