‘మాయాబజార్’ తెలుగు సినిమా రంగంలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్. ఈ సినిమా సినిమా విడుదలై మంగళ వారానికి 68 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన గొప్ప పౌరాణిక చిత్రమిది. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి ఈ చిత్రాన్ని చిరస్మరణీయంగా రూపొందించారు. దర్శకుడు కె.వి.రెడ్డి ఈ చిత్రాన్ని అపూర్వంగా, అనూహ్యంగా, అనితర సాధ్యంగా తెలుగు తెరపై ఓ సెల్యులాయిడ్ కావ్యంగా మలిచారు. ఈ చిత్రాన్ని ఈనెల 28న మహానటుడు ఎన్.టి. రామారావు 102వ జయంతి సందర్భంగా బలుసు రామారావు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా టి.డి.జనార్దన్, రమేష్ ప్రసాద్, ఎస్‌వి కష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, దర్శకుడు వీరశంకర్, భగీరథ, వైజే రాంబాబు, త్రిపురనేని చిట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బలుసు రామారావు మాట్లాడుతూ,’నేను రామారావుకి వీరాభిమానిని. ఆయన దగ్గర పనిచేసే అదష్టం నాకు కలిగింది. ఆయన మీదున్న అభిమానంతో నేను ‘మాయాబజార్’ను రీ-రిలీజ్ చేస్తున్నాను’ అని తెలిపారు.