- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో రాకాసి అలల ఉద్ధృతి కారణంగా మాయపట్నం గ్రామం జలమయమైంది. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడి ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ.. మాయపట్నం వద్ద అలల తాకిడి తీవ్రంగా ఉండటంతో అనేక ఇళ్ళు నీట మునిగినట్లు తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మాయపట్నం గ్రామంలోని ప్రజలకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ , అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వరద బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని స్పష్టం చేశారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు వైద్య సిబ్బందిని, ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలని దిశానిర్దేశం చేశారు.
- Advertisement -