ఏపీసీ కార్యదర్శి సురేందర్ మోహన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో యూరియా పక్కదారి పట్టకుండా అన్ని చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి (ఏపీసీ) కార్యదర్శి సురేందర్ మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి డైరెక్టర్ బి.గోపితో కలిసి డీఏవోలు, డీసీవోలు, డీటీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా పక్కదారి పట్టకుండా నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యాడ్ బ్లూ యూనిట్లు, రంగులు, ప్లైవుడ్ తదితర వ్యవసాయేతర పరిశ్రమలకు అక్రమంగా రవాణా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయా కంపెనీలను తనిఖీ చేయాలని ఆదేశించారు. యూరియా అక్రమాలపై సమాచారం అందించేందుకు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నెంబర్ (8977741771)ను ఎరువుల షాపులతో పాటు బస్టాండ్లు ఇతర పబ్లిక్ స్థలాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రయివేట్ ఎరువుల దుకాణాలతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాల్లో స్టాక్ బోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. సరిహద్ధు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు యూరియా అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ష
యూరియా పక్కదారి పట్టకుండా చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES