Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్మేడారంలో రేపు అత్యాధునిక పద్ధతిలో మాంస శుద్ధి "స్లాటర్ హౌస్" ప్రారంభం.. 

మేడారంలో రేపు అత్యాధునిక పద్ధతిలో మాంస శుద్ధి “స్లాటర్ హౌస్” ప్రారంభం.. 

- Advertisement -

– 12 లక్షలతో కాంగ్రెస్ నాయకుని విరాళంతో ఏర్పాటు.. 
నవతెలంగాణ -తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వనదేవత ప్రాంగణంలో ప్రజలకు సుచికరమైన నాణ్యమైన మాంసాన్ని అందించాలని లక్ష్యంతో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతల ప్రియ భక్తుడు, కూరాకుల ఆంజనేయులు గారి విరాళం 12 లక్షలతో విలువగల పోర్టబుల్ స్లాటర్ హౌస్ నిర్మాణం చేపట్టారు. వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు 12 లక్షలతో అత్యధిక సౌకర్యాలతో నిర్మించిన ఈ కబేలా (జంతువదశాల) నిర్మించారు. మేడారంలో నిర్మించిన కబేళాతో భక్తులకు, ప్రజలకు నాణ్యమైన మాంసం ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. మేడారంలో మాంసం విక్రయించే వ్యాపారులు సుమారు 150 వరకు ఉంటారు. భక్తుల, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మాంసం కోసం గొర్రెలు మేకలను వధించేందుకు అత్యధిక సౌకర్యాలతో స్లాటర్ హౌసును రేపు శనివారం ప్రారంభించనున్నారు. అత్యాధునిక పద్ధతిలో మాంసం వ్యర్థాలతో వేరే ఉత్పత్తి చేసే ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మాంసాన్ని నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా ఫ్రీజర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మాంసం నాణ్యత నిర్ధారించేందుకు పశు వైద్యుని నియమించారు. అందరూ ఆరోగ్యంగా ఉండడానికి మేడారానికి వచ్చే భక్తులు స్లాటర్ హౌస్ ను వినియోగించుకోవాలని పశువైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -