- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మేడారం మహా జాతర సందర్భంగా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లకు సెలవు ఉంటుందని అధికారులు ప్రకటించారు. దీనికి బదులుగా ఫిబ్రవరి 14న (రెండో శనివారం) పనిదినంగా పరిగణించాలని పేర్కొన్నారు. కాగా జాతరకు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు భారీగా వెళ్లనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా రేపటితో సమ్మక్క-సారక్క జాతర ముగియనుంది.
- Advertisement -



