Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమేడారం మహా జాతర తేదీలు ఖరారు..

మేడారం మహా జాతర తేదీలు ఖరారు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సమ్మక్క, సారలమ్మ మేడారం జాతరకు వెళ్లే భక్తులకు అలర్ట్. మేడారం మహా జాతరకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం మహా జాతరకు పేరు ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పండుగ.. 2026 లో రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జాతరకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారు.

ఈ మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే సంవత్సరం జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జాతర జరగనుంది. జనవరి 28వ తేదీన సారలమ్మ, గోవిందా రాజు, పగడిద్దరాజు గద్దెలకు చేరుకుంటారు. ఇక జనవరి 29వ తేదీన సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. ఈనెల 30వ తేదీన భక్తులు… మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే 31వ తేదీన అమ్మవార్ల వనప్రవేశం కూడా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరగనున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad