Thursday, May 15, 2025
Homeతాజా వార్తలుమేడ్చల్ ప్రయివేటు బస్సు దగ్ధం

మేడ్చల్ ప్రయివేటు బస్సు దగ్ధం

- Advertisement -

నవతెలంగాణ మేడ్చల్ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగి, పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మేడ్చల్ మండలంలోని బండ మైలారం నుండి కొంపల్లికి వెళ్తుండగా మేడ్చల్ ఐటిఐ వద్ద రాగానే ఓ ప్రయివేట్ బస్సులో మంటలు ఒకసారిగా చెలరేగాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపాడు. క్షణాలో బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ ద్వారానే బస్సు దగ్ధమైందని డ్రైవర్ తెలిపారు. సంఘటనా స్థలానికి ఫైర్స్ ఇంజన్ నీ చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన స్థలానికి మేడ్చల్ పోలీసులు చేరుకొని పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -