Monday, April 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాస కొత్తూర్ గ్రామ పంచాయతీలో వైద్య శిబిరం

హాస కొత్తూర్ గ్రామ పంచాయతీలో వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి  : మండలంలోని హస కొత్తూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం  చౌట్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఎన్ సి డి  క్యాంపు ఏర్పాటు చేశారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్పందన సమక్షంలో క్యాంపు నిర్వహించారు. క్యాంప్ కు హాజరైన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి రక్త పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ స్పందన  మాట్లాడుతూ బీపీ, షుగర్, చిన్న చిన్న వ్యాధులు ఉన్నవారికి చికిత్స చేసి మందులు అందించినట్లు తెలిపారు. సుమారు 76 మంది ప్రజలు క్యాంపుకు హాజరై వైద్య పరీక్షలు చేయించుకొని, మందులు తీసుకున్నారన్నారు.

ఈ  కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి నవీన్ గౌడ్, ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, ఏఎన్ఎంలు సుజాత, మమత, పాలక వర్గ సభ్యులు కనక నర్సయ్య, గ్రామ అభివృద్ది కమిటీ అధ్యక్షులు బంగ్లా లింబద్రి, ఆశ కార్యకర్తలు కల్పన, సుజాత, లావణ్య, మాజీ సర్పంచ్ చిటీకేసి గంగాధర్, పడల మల్లేష్, మంగా శ్రీకాంత్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -