Monday, July 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమెడికల్ మాఫియా... డాక్టర్ చీటీ లేకుండానే వయాగ్రా అమ్మకాలు

మెడికల్ మాఫియా… డాక్టర్ చీటీ లేకుండానే వయాగ్రా అమ్మకాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్; తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ మాఫియా గుట్టును డ్రగ్ కంట్రోల్ అధికారులు రట్టు చేశారు. రాజమండ్రి కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందాపై దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నిషేధిత మందులను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా వైద్యుల చీటీ లేకుండా విక్రయించకూడని వయాగ్రా ట్యాబ్లెట్లు, అబార్షన్ కిట్లను విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.

డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇటీవల రాజమండ్రిలోని పలు మెడికల్ షాపులపై మెరుపు దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు నిర్వాహకులు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు నిషేధిత మందులను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సొమ్ము చేసుకుంటున్నట్లు తేలింది. కేవలం మెడికల్ షాపులే కాకుండా, ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు సైతం ఈ అక్రమ దందాలో భాగస్వాములుగా ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు.

ఈ దాడుల సందర్భంగా రాజమండ్రికి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు, అతని వద్ద నుంచి పెద్ద ఎత్తున వయాగ్రా ట్యాబ్లెట్లు, అబార్షన్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఈ మందులను భారీగా దిగుమతి చేసుకొని, జిల్లాలోని మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నిబంధనలు ఉల్లంఘించిన పలు మెడికల్ షాపులను అధికారులు సీజ్ చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -