Friday, November 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమంగ్లీ పాటపై అసభ్యకర కామెంట్స్..పోలీసులు అదుపులో మేడిపల్లి స్టార్

మంగ్లీ పాటపై అసభ్యకర కామెంట్స్..పోలీసులు అదుపులో మేడిపల్లి స్టార్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఫోక్ సింగ‌ర్ మంగ్లీ తాజాగా ‘బావిలోనే బల్లిపడితే‘ అనే పాటను రీసెంట్ గా విడుదల చేయగా ప్రస్తుతం ఆ పాట ట్రెండింగ్ లో ఉంది. ఐదురోజుల్లోనే 8మిలియన్లకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. అయితే ఈ పాటపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే ఓ వ్యక్తి అసభ్యకర కామెంట్స్ చేశాడు. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో మంగ్లీ ఎస్ ఆర్ నగర్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది.

తన పాటను కించపరుస్తూ అసభ్యకర కామెంట్స్ చేశాడని, పాటనే కాకుండా ఎస్టీ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడాడని ఫిర్యాదులో పేర్కొంది. సింగర్ మంగ్లీ ఇచ్చిన ఫిర్యాదుతో కేవలం కొన్ని గంటల్లోనే నిందితుడు సోషల్ మీడియాలో రీల్స్ చేసే మేడిపల్లి స్టార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా మేడిపల్లి స్టార్ మళ్లీ ఇలా రిపీట్ చేయను అని మంగ్లీ క్షమించాలని వేడుకున్నాడు. తాను వీడియోను ట్రోల్ చేయలేదని పాట ట్రెండింగ్ లో ఉందని పాటకు వచ్చిన కామెంట్స్ పై ట్రోల్స్ చేశానని చెప్పాడు. దయచేసి తనను విడిచిపెట్టాలని కోరాడు. కాగా నిందితుడు గతంలోనూ సోషల్ మీడియాలో ఇలాంటి అసభ్యకర కామెంట్లే చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -