Sunday, April 12, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కొమురం భీం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం..

కొమురం భీం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : టీఎస్ యుటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవం, మహనీయుల జయంతి సందర్భంగా కొమురం భీం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వ‌హించారు. నేను సైతం అంటూ దూరాన్ని ఎండను కూడా లెక్కచేయకుండా వివిధ మండలాల నుండి టీఎస్‌యుటిఎఫ్ నాయకులు, కార్యకర్తలు వ‌చ్చారు. సామాజిక స్పృహతో స్పందించి అనేకమంది స్వచ్ఛందంగా రక్తదాతలుగా సిద్ధం అయ్యి ఇచ్చినందుకు, ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా జిల్లాలో మహిళలు రక్త దానం చేయడం అనేకమంది ప్రశంసించారు. కుల మతాలకు అతీతంగా.. వయస్సుతో నిమిత్తం లేకుండా 58 సంవత్సరాల వయసు కల వారు కూడా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించుకోవడానికి పూర్తిస్థాయిలో ఎఫర్ట్ పెట్టిన నాయకత్వానికి కార్యకర్తలకు. ముఖ్యంగా రక్త దాతలు అందరికీ, ఈ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో సహకరించిన ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు ప్రతి ఒక్కరికి పేరుపేరునా TSUTF జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -